కాబోయే పెళ్లి కూతురు అంటే రష్మిక మందన్న టోక్యో లో కనిపించింది. అది కూడా ట్రెడిషనల్ వేర్ లో. విజయ్ దేవరకొండ తో డేటింగ్ లో ఉన్న రష్మిక గత ఏడాది ఆక్టోబర్లో సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని వచ్చే ఫిబ్రవరిలో పెళ్ళికి సిద్దమవుతుంది అనే టాక్ ఉంది కానీ.. రష్మిక, విజయ్ దేవరకొండ లు మాత్రం ఈ విషయం స్పందించరు.
క్రిష్టమస్, న్యూ ఇయర్ వేడుకలకు విజయ్ తో కలిసి ట్రిప్ కి వెళ్లిన రష్మిక ఇప్పుడు టోక్యో లో ఎంజాయ్ చేస్తుంది. కారణం అక్కడ జపాన్ లో పుష్ప ప్రీమియర్స్ కి అల్లు అర్జున్ తో కలిసి వెళ్లడమే. రష్మిక గ్రీన్ డ్రెస్ లో రష్మిక మెరిసిపోయింది. గ్రీ ట్రెడిషనల్ వేర్ లో సన్ లైట్ ని ఎంజాయ్ చేస్తూ కనిపించిన రష్మిక కి పెళ్లి కళ వచ్చేసింది అంటూ టిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ఫిబ్రవరి 2 న రష్మిక-విజయ్ దేవరకొండ ఏడడుగులు నడిచి ఓ ఇంటి వారు కాబోతున్నారని, పెళ్లి కూడా గోవా లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారమైతే గట్టిగానే జరుగుతుంది.