యంగ్ టైగర్ ఎన్టీఆర్-కన్నడ స్టార్ డైరెక్టర్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్(వర్కింగ్ టైటిల్) మూవీ షూటింగ్ అప్ డేట్ గురించి అందులో నటించే స్టార్స్ గురించి అందరూ క్యురియాసిటీగా ఎదురు చూస్తుంటే.. మేకర్స్ మాత్రం చాలా సైలెంట్ గా డ్రాగన్ అప్ డేట్ వదలకుండా కూర్చున్నారు.
ఎన్టీఆర్ ఆయన కు జోడిగా కన్నడ భామ రుక్మిణి వసంత్ నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో తోవినో థామస్ నటిస్తున్నారు అలాగే బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతుండగా.. తాజాగా అనిల్ కపూర్ తను ఎన్టీఆర్ మూవీలో నటిస్తున్నట్లుగా కన్ ఫర్మ్ చేసారు.
ఎన్టీఆర్-నీల్ మూవీ సెట్ పిక్ పంచుకుంటూ.. ఒక సినిమా వచ్చేసింది, మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్-నీల్ మూవీలో నటిస్తున్నట్టుగా చెప్పేసారు. ఇప్పటికే ఎన్టీఆర్ తో అనిల్ కపూర్ వార్ 2 లో నటించారు.