మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి తో ఓకే ఓకే అనిపించినా నవీన్ పోలిశెట్టి బిగ్ బ్రేక్ తో సైలెంట్ గా అనగనగ ఒక రాజు చిత్రాన్ని పూర్తి చేసాడు, మధ్యలో నవీన్ పోలిశెట్టి కి యాక్సిడెంట్ అవడం, ఆతర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల వెళ్లిపోవడం, మీనాక్షిచౌదరి ఎంటర్ అవడం ఇవన్నీ జరిగాక సడన్ గా అనగనగ ఒకరాజు ని సంక్రాంతికి రిలీజ్ అంటూ ఒక్కసారిగా అందరి చూపు ఆ సినిమాపై పడేలా చేసాడు.
ఆతర్వాత ప్రమోషన్స్ తో సంక్రాంతి సినిమాలకు గట్టిపోటీ ఇస్తున్నట్టుగా కనిపించినా ప్రభాస్, చిరు సినిమాల్తో పోటీపడడం అవసరమా అనుకున్నా.. తనకున్న ప్రమోషన్స్ స్ట్రాటజీతో నవీన్ పోలిశెట్టి ఫైనల్ గా కామెడీతో ఆడియన్స్ ని కట్టుకుని ట్రాక్ లోకి వచ్చేసాడు.
అదే మాదిరి వరస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నా మరో యంగ్ హీరో శర్వానంద్. ఈ సంక్రాంతి కి నారి నారి నడుమ మురారి ని దించి తప్పు చేస్తున్నాడు అనుకున్నవారికి కామెడీతో కరెక్ట్ సమాధానం చెప్పాడు. నారి నారి నడుమ మురారి శర్వా-నరేష్ కలయికలో తండ్రి-కొడుకుల కామెడీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం తో సినిమాకి హిట్ కళ వచ్చేసింది.
దానితో శర్వానంద్ ట్రాక్ లోకి వచ్చేసాడు. ఈ సంక్రాంతికి బిగ్ కాంపిటీషన్ ఉన్న శర్వానంద్ నారి నారి నడుమ మురారి ఖచ్చితంగా వర్కౌట్ అవ్వడమే కాదు నిర్మాత అనిల్ సుంకరకు లాభాలొచ్చేయ్యడం గ్యారెంటీ.