శతమానం భవతి తో సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన శర్వానంద్ మళ్లీ ఈ సంక్రాంతికి తానేమిటో ప్రూవ్ చేసుకున్నాడు. కొన్నేళ్లుగా సక్సెస్ వెయిట్ చేస్తున్న శర్వానంద్ ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో సతమతమవుతూనే రెండు సినిమాలను సిద్ధం చేసాడు. అందులో ముందుగా నారి నారి నడుమమురారి అంటూ ఈ సంక్రాంతికి సినిమాని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు.
కారణం హిట్టు లేదు, ఇలాంటి సమయంలో ప్రభాస్, చిరు, రవితేజ లాంటి పెద్ద హీరోలను ఢీకోవడం అవసరమా అన్నారు. నిజమే శర్వానంద్ రాంగ్ టైమ్ లో దిగుతున్నాడని ఆయన అభిమానులే అనుకున్నారు. నిన్న బుధవారం భోగి సందర్భంగా విడుదలైన నారి నారి నడుమ మురారి కి సూపర్ హిట్ టాక్ వచ్చేసింది, చాలా రోజుల తర్వాత శర్వానంద్ ఊపిరి పీల్చుకున్నాడు, నామ మాత్రపు ప్రమోషన్స్ తో, హడావిడి లేకుండా వచ్చిన శర్వాని ప్రేక్షకులు ఆదరించేసారు.
నారి నారి నడుమ మురారి తండ్రి - కొడుకుల మద్యన సృష్టించిన ఫన్ కామెడీ. దీనిని ఆడియన్స్ థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నారి నారి నడుమ మురారి స్టోరీ లైన్, సాంగ్స్, ప్యూర్ కామెడీ సినిమాకి ప్లస్ అవ్వగా.. స్లో నేరేషన్ కాస్త ఇబ్బంది పెట్టినా కామెడీని ఎంజాయ్ చేస్తూ ఆడియన్స్ అస్సలు బోర్ అవ్వట్లేదు అంటున్నారు.
రాజాసాబ్, మన శంకర వరప్రసాద్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగ ఒకరాజు చిత్రాలు మధ్యన నలిగిపోతుంది అనుకున్న శర్వా సినిమా ఇప్పుడు హిట్టు కళతో థియేటర్స్ లో కళకళలాడుతుంది.