బిగ్ బాస్ సీజన్ 9 లో లవ్ బర్డ్స్ గా ప్రొజెక్ట్ అవడమే కాదు వారు నిజంగా లవర్స్ అనుకునేలా కనిపించారు. వారెవరో కాదు రీతూ చౌదరి-డిమోన్ పవన్ లు. వారు హౌస్ లో టాప్ 5 వెళతారు అని అనుకుంటే ముందుగా రీతూ చౌదరి హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వగా డిమోన్ పవన్ ఎలాగో టాప్ 3 కి వెళ్ళాడు.
ఇక బయటికొచ్చాక రీతూ తో కలిసి డిమోన్ పవన్ స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో పాల్గొనడమే కాకుండా స్టేజ్ పై రీతూ పవన్ కి ముద్దులు పెడుతూ రెచ్చిపోయింది. ఇక బిగ్ బాస్ షో అవ్వగానే శని, ఆదివారాల్లో మొదలైన BB జోడి డాన్స్ షో లోకి కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వెళ్లారు.
కానీ పవన్ - రీతూ ఉండరేమో అనుకుంటే ఈ వారం రీతూ-పవన్ లు ఎంటర్ అయ్యారు. BB జోడీలో పవన్ - రీతూ లు అదిరిపోయే కాదు సెగలు కక్కే పెరఫార్మెన్స్ ఇచ్చినట్లుగా ఈవారం వదిలిన ప్రోమో చూస్తే తెలుస్తుంది. రీతూ-డిమోన్ పవన్ ల కెమిస్ట్రీ చూస్తే వారు ఫ్రెండ్స్ ఏమిటి, లవర్స్ అనుకోవడంలో తప్పే లేదు.