సంక్రాంతి స్పెషల్ గా విడుదలైన కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు కి హిట్ టాక్ వచ్చేసింది. జనవరి 14 న రిలీజ్ అంటూ ప్రభాస్, మెగాస్టార్, రవితేజ లకు ఛాలెంజ్ చెయ్యడమే కాదు అందుకు తగ్గ క్రేజీ ప్రమోషన్స్ తో సంక్రాంతి బరిలోకి దించారు. చిన్న సినిమా, చిన్న హీరో అనుకుంటారేమో అని నవీన్ ప్రమోషన్స్ తోనే యూత్ ని తనవైపుకు తిప్పుకున్నాడు.
ఇక నేడు వరల్డ్ వైడ్ గా విడుదలైన అనగనగా ఒక రాజు చిత్రానికి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. స్టోరీ రొటీన్ అయినా నవీన్ పోలిశెట్టి తన భుజాల మీద సినిమాని మోశాడు, అంటే నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో చేసాడు.. అంటూ సినిమా చూసిన ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు. యూత్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని నవీన్ పోలిశెట్టి థియేటర్స్ కి రప్పిస్తాడు.
హీరోయిన్ మీనాక్షి చౌదరి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అంతేకాదు నవీన్‌తో ఆమె స్క్రీన్ పెయిర్ ఆకట్టుకునేలా ఉంది.. ఇక నిర్మాతలు బడ్జెట్ భారీ గాపెట్టడంతో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా కుదిరాయి. మరి ఈ సంక్రాంతి విన్నర్స్ లిస్ట్ లోకి అనగనగ ఒక రాజు కూడా చేరిపోయింది.