మాస్ మహారాజ్ రవి తేజ ఎనర్జీ తో సినిమా చేస్తారు. ఎక్కడా గ్యాప్ ఇవ్వరు. ప్లాప్ లు వస్తున్నాయి కదా అని బ్రేక్ తీసుకోరు. తన మానాన తను సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. దర్శకుల తప్పిదమో, రవితేజ కథల ఎంపికలో లోపమో తెలియదు కానీ.. ఆయనకు అరడజనకు పాయిగా ప్లాప్ లు ఉన్నాయి. ధమాకా ఆతర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఆయనేమో కానీ ఆయన అభిమానులు చాలానే వెయిట్ చేసారు.
ఫైనల్లీ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి హిట్ కొట్టినట్టే కనిపిస్తుంది. మిక్స్డ్ టాక్ అయినా సంక్రాంతి సీజన్ కాబట్టి ఖచ్చితంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి వర్కౌట్ అవడం ఖాయం. ఈరోజు జనవరి 13 న విడుదలైన ఈ చిత్రానికి పూర్తిగా పాజిటివ్ రెస్పాన్స్ రాకపోయినా.. డిజప్పాయింట్ అయితే చెయ్యలేదు అంటున్నారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం ఫస్ట్ హాఫ్ బావుంది. సత్య, సునీల్, వెన్నెల కిషోర్ లు కామెడీతో నిలబెట్టేసారు, రవితేజ ఎనేర్జి గా కనిపించలేదు, ఆయన పెరఫార్మెన్డ్ ఎలా ఉన్నా ఎనేర్జి లెవల్స్ తగ్గాయి.. సెకండ్ హాఫ్ అలాగే క్లైమాక్స్ చెత్తగా ఉంది. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగినా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది అంటున్నారు.
ఏదైనా భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫుల్ గా సాటిస్ఫై అవ్వకపోయినా డిజప్పాయింట్ అయితే చెయ్యలె అంటూ రవితేజ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు..