ప్రభాస్ తో రొమాన్స్ అంటే చాలు హీరోయిన్స్ కథలు కూడా వినకుండానే ఓకె చెప్పేస్తారు. అయితే ఇక్కడ మరీ క్రేజీ హీరోయిన్స్ కాకపోయినా గ్లామర్ కి కేరాఫ్ గా నిలిచే నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం తీసుకొచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు దర్శకుడు మారుతి. రాజసాబ్ లో ముగ్గురు హీరోయిన్, అది కూడా ప్రభాస్ తో రొమాన్స్ అంటే అందరిలో క్రేజ్ ఉంటుంది.
ఆ ముగ్గురు హీరోయిన్స్ కూడా ప్రభాస్ మూవీతో టాలీవుడ్ లోను, అందులోను పాన్ ఇండియా మార్కెట్ లో అల్లాడిద్దామనుకుంటే దర్శకుడు మారుతి ముగ్గురు హీరోయిన్స్ ని హోల్సేల్ గా ముంచేశాడు. ప్రభాస్ తో సినిమా అంటే రెచ్చిపోయిన నిధి, మాళవిక, రిద్ది లు అభిమానులకు కావాల్సినంత అందాలు ఆరబోశారు.
కానీ సినిమాలో వాళ్ళ కేరెక్టర్ చూస్తే.. ప్రభాస్ కోసం కొట్టుకుచచ్చే ముగ్గురు హీరోయిన్లు, అసలు ఏ ఈసినిమాలో వారు అవసరమా అనే ఫీలింగ్ తెప్పించారు. మరికొంతమంది ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ కోసం ఇలాంటి హీరోయిన్ల ను తీసుకుంటారా, డేట్స్ అడిగితె ఇచ్చేటువంటువంటి హీరోయిన్స్ ప్రభాస్ కి అవసరమా అంటున్నారు.
అటు ప్లాప్ లో ఉన్న నిధి ప్రభాస్ రాజసాబ్ తో కమ్ బ్యాక్ ఇద్దామనుకుంటే.. రాజసాబ్ రిజల్ట్ తేడా కొట్టింది. ఇక మాళవిక మోహనన్ కూడా టాలీవుడ్ కి స్ట్రాంగ్ ఎంట్రీ ఇద్దామనుకుంది, రిథి కుమార్ అది అదే పరిస్థితి. కానీ మారుతి వారి ఆశలను అడియాసలు చేసేసాడు.