తెలంగాణాలో టికెట్ రేట్స్ హైక్స్ విషయం నాకు తెలియదు. నన్ను ఎవరు అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి కలవడం లేదు, నేను సినిమా టికెట్ హైక్ ఇవ్వలేదు, అసలు సినీ పరిశ్రమ గురించి పట్టించుకోవడం మానేశాను , టికెట్ ధరల పెంపు గురించి వస్తున్న జీవోలకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ సినిమాటోగ్రఫీ మినిస్టర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చారు.
కానీ ఈరోజు ఆయన నాకు అన్ని తెలిసే జరుగుతున్నాయి. తెలంగాణాలో సినిమా టికెట్ రేట్ల పెంపు నాకు తెలిసే జరుగుతుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాజశేఖర్ రెడ్డి లాగా ఎవరి శాఖలో జోక్యం చేసుకోడు, టికెట్ ధరల గురించి మేమందరం కలిసి కూర్చుని మాట్లాడిన తరువాతే నిర్ణయం తీసుకున్నాము అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా ముందు చెప్పడం హాస్యాస్పదంగా మారింది.
కేవలం రెండు రోజుల్లోనే కోమటి రెడ్డి మాటల్లో ఇంత వ్యత్యాసమా అని నెటిజెన్స్ షాక్ అవుతుంటే.. ప్రతిపక్షంలో హరిష్ రావు ఈ విషయంలో రచ్చ చేస్తున్నాడు, అలాంటప్పుడు తమ మంత్రిని రేవంత్ రెడ్డి అదుపులో పెట్టుకున్నాడు, కోమటిరెడ్డి కి ఎలాంటి వార్నింగ్ ఇచ్చారో తెలియదు కానీ.. మాట భలే మార్చేసాడంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.