డిసెంబర్ 5 న విడుదల కాబోయి డిసెంబర్ 12 న థియేటర్స్ లో విడుదలైన నందమూరి నటసింహ బాలకృష్ణ-బోయపాటి ల అఖండ 2 తాండవం చిత్రం పాన్ ఇండియా వ్యాప్తంగా మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బాలయ్య అఘోర గెటప్ ని మెచ్చిన ప్రేక్షకులు బోయపాటి మేకింగ్ ని మెచ్చలేకపోయారు.
థియేటర్స్ లో సో సో గా పెరఫార్మెన్సు ఇచ్చిన ఈ చిత్రాన్ని డిజిటల్ పార్ట్నర్ నెట్ ఫ్లిక్స్ నెల తిరిగేలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. జనవరి 9 నుంచి అఖండ 2 తాండవం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్ లో అఖండ 2 ని వీక్షించిన ఓటీటీ ఆడియన్స్ గోలెత్తిపోతున్నారు.
సినిమా స్టార్ట్ చేసిన పది నిమిషాకే చిరాగ్గా ఉంది అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. బాలయ్య అఘోర గెటప్ బావుంది, ప్రగ్య జైస్వాల్ కేరెక్టర్ ఉంచాల్సింది, బోయపాటి పాన్ ఇండియా మార్కెట్ అంటూ కోసం ఏదేదో చేసాడు, అఖండ చిత్రం అద్భుతమైన యాక్షన్ ఫిలిం, కానీ అఖండ 2 మాత్రం అభిమానులకే ఎక్కదు, అభిమానులును కూడా డిజప్పాయింట్ చేసుంటుంది ఈ చిత్రం అంటూ ఓటీటీ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు.