పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ ఆన్ లైన్ లో ప్రత్యక్షమవడం మేకర్స్ కి షాకిచ్చింది. ఈ శుక్రవారమే విడుదలైన రాజసాబ్ ని పైరసీ రాయుళ్లు ఆన్ లైన్ లో లీక్ చేసేసారు. అసలే తెలంగాణాలో ప్రీమియర్స్ ఎఫెక్ట్ తో కలెక్షన్స్ తగ్గడం, రాజసాబ్ కి నెగెటివ్ టాక్ రావడం ఇవన్నీ ఒక ఎత్తు.. ఈ సినిమా ఆన్ లైన్ లో కనిపించడం మరో ఎత్తు.
ఇప్పటికే మేకర్స్ కి ఈ ఆదివారం తర్వాత పరిస్థితి అర్ధం కాక తలపట్టుకున్నారు. సోమవారం నుంచి ప్లాప్ సినిమాగా రాజసాబ్ మిగిలిపోతుంది అని మేకర్స్ తో పాటుగా అభిమానులు టెన్షన్ పడుతుంటే ఇప్పుడు ఈ సినిమా శనివారం నుంచే ఆన్ లైన్ లో ప్రత్యక్షమవడం మాత్రం బిగ్ షాక్ అనే చెప్పాలి. ప్లాప్ అంటున్న సినిమాని కూడా లీక్ చేసేంత గొప్ప మనసు ఎవరికి ఉందొ తెలియదు కానీ..
ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత సినిమా ఇండస్ట్రీ పైరసీ పై కాస్త రిలాక్స్ అయినా.. రవి అరెస్ట్ అయిన వారమే కొత్త సినిమాలను పైరసీ చేసారు కొంతమంది. ఎవరిని అరెస్ట్ చేసినా, ఎవరిని జైల్లో పెట్టినా ఈ పైరసీ భూతాన్ని వదిలించడం అనేది అంత తేలికైన పని కాదు.