జనవరి 9 న సంక్రాంతి స్పెషల్ గా విడుదలైన ది రాజసాబ్ కి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ స్ప్రెడ్ అయ్యింది. దర్శకుడు మారుతి మిస్టేక్స్ అంటూ సోషల్ మీడియాలో ఆయన స్నేహితులే తిడుతున్నారు. కానీ మేకర్స్ రాజసాబ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ హడావిడి చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి.. ప్రభాస్ తో సినిమా, అది నా అదృష్టం, ప్రభాస్ ని రాజాసాబ్ లో చాలా బాగా చూపించావ్ అంటూ అందరూ అప్రిషేట్ చేస్తున్నారు.
సినిమా చూసి ప్రభాస్ అభిమానులే బాగా తీసావ్ అన్న అని ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో అప్పుడే ఒక సినిమా ఫలితాన్ని డిసైడ్ చేయొద్దు. ఓల్డ్ గెటప్ లో ప్రభాస్ గారిని ట్రైలర్ లోనే పరిచయం చేశాం. ఆయన స్వాగ్, గెటప్, మేనరిజమ్ చూపించాం, థియేటర్స్ లోకి వచ్చేసరికి ఆ ప్రభాస్ గారి సీన్స్ ఏవి అని ప్రేక్షకులు వెతుక్కున్నారు.
ఆ క్రమంలో మేము చూపించే కథకు వారు కనెక్ట్ కాలేకపోయారు. చాలా మంది ప్రభాస్ గారి అభిమానులు నాతో మాట్లాడారు. సినిమా బాగా చేశావన్నా అని అన్నారు. ఓల్డ్ గెటప్ సీన్స్ వస్తే బాగుంటుందన్నా అన్నారు. వారి సూచన మేరకు ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ సీన్స్ ను యాడ్ చేశాం. ఈ రోజు సాయంత్రం షోస్ నుంచి ఆ సీన్స్ రాజా సాబ్ మూవీలో చూస్తారు.
అంతేకాదు సోమవారం నుంచి రాజసాబ్ టికెట్ రేట్లు యధావిధిగా అంటే రెగ్యులర్ టికెట్ రేట్లు ఉంటాయని మారుతి చెప్పగానే ఇప్పటికే ఒకసారి సినిమా చూసి చిరాకొచ్చింది, ఇప్పుడు ఆ ఓల్డ్ గెటప్ కోసం మళ్ళీ సినిమా చూడాలా అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.