దర్శకుడు మారుతి ప్రభాస్ తో సినిమా చేస్తున్నారనగానే ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా ఖండించారు, వారి నుంచి విపరీతమైన నెగిటివిటీ కనిపించింది. మారుతి తో ప్రభాస్ ఎందుకు సినిమా ఒప్పుకున్నారు, ప్రభాస్ రేంజ్ ఏమిటి, మారుతి రేంజ్ ఏమిటి అని వారు ఫైర్ అయ్యారు. అందుకే మారుతి ప్రభాస్ సినిమా విషయంలో నేరుగా అప్ డేట్స్ ఇవ్వకుండా తన రిపోర్టర్ ఫ్రెండ్ తో ట్వీట్లు వేయించేవాడు. ఫస్ట్ లుక్ తో రాజసాబ్ గా ప్రభాస్ ని చూసి వింటేజ్ లుక్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త శాంతించారు.
ఆతర్వాత కూడా తన రిపోర్టర్ ఫ్రెండ్ తోనే రాజసాబ్ పై ట్వీట్లు వేయిస్తూ సినిమా విడుదల సమయానికి ఎలాగో అభిమానుల నమ్మకాన్ని సంపాదించాడు మారుతి. రాజసాబ్ విడుదలయ్యింది నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. దానితో మారుతి ఫ్రెండ్ రిపోర్టర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడ్డారు. సదరు రిపోర్టర్ మారుతి తన ఫ్రెండ్ అంటూనే.. రాజాసాబ్ కి పూర్ రేటింగ్స్ వచ్చాయి, అసలు ఆ రైటింగ్ ఏమిటి..
ఆయన దగ్గర మంచి రైటింగ్ టీమ్ ఉంది. ఇక ప్రభాస్ ఎంట్రీ సీన్ తర్వాత సాంగ్ ఏమిటి, అలాంటివి ఎన్ని చూడలేదు, ఇక హీరోయిన్స్ విషయానికొస్తే అసలు ఆ ముగ్గురు హీరోయిన్స్ ప్రభాస్ రేంజ్ హీరోయిన్స్ కాదు.. డేట్స్ ఇవ్వరేమో, దొరకవేమో అన్నట్టుగా ఆ ముగ్గురిని తీసుకొచ్చారు, వెనకటికెవడో చెప్పాడు పనసకాయ దొరికింది కదా తద్దినం పెట్టేసుకుందాం అన్నట్టుగా, ఈ సినిమా 500 కోట్ల సినిమా, హీరోయిన్స్ తో ప్రభాస్ రొమాన్స్ ఏమిటి...
ఆ కామెడీ ఏమిటి. మారుతికి ఆస్థాన నటులు కొంతమంది ఉంటారు, ప్రభాస్ సినిమాకైనా వారే, గోపీచంద్ సినిమాకైనా వారే, ప్రభాస్ కి సప్తగిరి కి ఆ డ్రెస్ లేమిటి.. సప్తగిరికి బట్టలు వేయించి కామెడీ చేయించలేమా.. ఒక్క సీన్ కైనా నవ్వొచ్చిందా అంటూ సదరు రిపోర్టర్ మారుతిని తన రివ్యూలో ఏకి పడేసాడు.
అది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ మరింతగా మండిపడుతున్నారు. మీ ఫ్రెండ్ నిన్ను ముంచేశాడు, ఆ హీరోయిన్స్ విషయం నీకు ముందే చెప్పొచ్చుగా అంటూ ఆగ్రహంతో వారు ఊగిపోతున్నారు.