ది రాజసాబ్ టికెట్ రేట్ల హైక్ విషయంలో తెలంగాణాలో చాలా గందరగోళం నడిచింది. ప్రీమియర్స్ దుమ్మురేఫుదామనుకున్న రాజసాబ్ కి ఈ టికెట్ రేట్లు జీవో దెబ్బేసింది. అర్ధరాత్రి వరకు టికెట్ రేట్ల విషయంలో గందరగోళం నడిచి టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాక నిర్మాతలు ఎంతోకొంత నష్టపోయారు. కానీ ఇప్పడు మెగాస్టార్ చిరు సినిమాకి ముందే టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు తెలంగాణ ప్రభుత్వం కల్పించింది.
సోమవారం జనవరి 12 న విడుదల కాబోయే మన శంకర వరపసాద్ గారు చిత్రానికి టికెట్ రేట్లు ఫిక్స్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకరవరప్రసాద్ గారు చిత్రానికి టికెట్ రేట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈనెల 11న ప్రీమియర్ షోస్ కు అనుమతిస్తూ టికెట్ ధరను రూ.600గా నిర్ణయించింది. అంతేకాకుండా వారంపాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అంగీకారం తెలిపింది. సింగిల్ స్క్రీన్ లో GSTతో కలిపి రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 పెంచుకునే వెసులుబాటు కలిపించింది.