ఈ మధ్య కాలంలో సవాల్ చేసి సక్సెస్ అందుకోవడం అన్నది పరిపాటిగా మారింది. `కోర్టు` రిలీజ్ కు ముందు నటుడు, ఆ చిత్ర నిర్మాత నాని హిట్ కొడుతున్నాంటూ కాలరెగరేసి మరీ చెప్పాడు. ఆ సినిమా ప్లాప్ అయితే తాను నటిస్తోన్న `హిట్ 3` సినిమా చూడొద్దని సవాల్ చేసాడు. కోర్టు కంటెంట్ లో అంత దమ్ముంది కాబట్టి నాని ఆ సవాల్ చేసి నెగ్గాడు. అంతకు ముందు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడ `క` రిలీజ్ కు ముందే అంతే ఫైర్ తో సవాల్ విసిరాడు.
`క` హిట్ అవ్వకపోతే గనుక సినిమాలు చేయడం మానేస్తానని..ఇంటికెళ్లి పొలం పనులు చేసుకుంటానని సవాల్ విసిరాడు. కట్ చేస్తే `క` రిలీజ్ అనంతరం బ్లాక్ బస్టర్ అయింది. `క `లో కంటెంట్ ఉంది కాబట్టి అంత స్ట్రాంగ్ గా కాన్పిడెంట్ గా సవాల్ చేసాడు. మరి దర్శకుడు మారుతి పరిస్థితి ఏంటి? అంటే? `ది రాజాసాబ్` ప్రీ రిలీజ్ వెంట్ లో మారుతి సైతం సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. రాజాసాబ్ నిరాశపరిస్తే, తన ఇంటికి వచ్చి పగ తీర్చుకోమని ప్రభాస్ ఫ్యాన్స్ కి సవాల్ విసిరాడు.
ఈ సినిమాలోని ప్రభాస్‌ను చాలా సంవత్సరాల పాటు గుర్తుంచుకుంటారని వ్యాఖ్యానించాడు. మరి ఆ సవాల్ కి మారుతి న్యాయం చేసాడా? ఆ సవాల్ నిలబడిందా? అంటే నిన్నటి రోజున రిలీజ్ అయిన రాజాసాబ్ పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియర్ షోతో రాజాసాబ్ తేలిపోయాడు. సినిమా డిజాస్టర్ గా తేలిపోయింది. పబ్లిక్ టాక్ చూస్తే తెలుగు సినిమా చరిత్రలో ఇంత చెత్త టాక్ మరే సినిమాకు రాలేదనిపిస్తుంది.
మీమర్స్ వాస్తవాలతో చెలరేగిపోతున్నారు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ మారుతి ఇంటికెళ్తే ఆఛానల్ పై దాడి చేసే ప్రయత్నం చేసారు. అంతకు ముందు మారుతి కోసం కొంత మంది అభిమానులు ఆయన ఇంటికి చేరుకోగా,ఇంకొంత మంది మరోసారి ఇంటి అడ్రస్ పెట్టమని అడుగుతున్నారు. మరి ఈ విమర్శలపై మారుతి స్పందిస్తాడా? లేదా? అన్నది చూడాలి. కానీ అభిమానులను దృష్టిలో పెట్టుకుని స్పందించాల్సిన అవసరమైతే మారుతిపై ఉందని ఫిలిం సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.