నయనతార తో ప్రమోషన్స్ చేయించడం అది కేవలం దర్శకుడు అనిల్ రావిపూడి వల్లే సాధ్యమైంది, అదే ఇప్పుడు నడుస్తున్న టాక్. మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం లో నయనతార నటిస్తున్నట్లుగా ఓ ప్రమోషనల్ వీడియో తో అనిల్ రావిపూడి నయనతార ను పరిచయం చెయ్యడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఆ తర్వాత నయనతార మన శంకర వరప్రసాద్ ప్రమోషన్స్ అన్నిట్లో కనిపిస్తుంది, మీడియా ముందుకు వస్తుంది అనుకున్నారు. అనిల్ రావిపూడి కూడా నయనతార తో మరో ప్రమోషనల్ వీడియో చేయించడంతో నయనతార బాగా కోపరేట్ చేస్తుంది.. ఇక మన శంకర వరప్రసాద్ ప్రమోషన్స్ అన్నిటిలో ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను కనిపిస్తుంది అని మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసారు.
కానీ నయనతార మాత్రం ఆ స్పెషల్ వీడియోస్ తో సరిపెట్టుకోండి, నేను మరె ఇతర ప్రమోషన్స్ కు రాను అని అనిల్ రావిపూడి తో చెప్పినట్లుగా ఉంది, అందుకే అనిల్ రావిపూడి.. నయనతారపై ఒత్తిడి పెరిగింది అని చెప్పాడు. సో ఇకపై మన శంకర వరప్రసాద్ ప్రమోషన్స్ లో నయన్ కనిపించదు, ఇక సినిమాలో మాత్రమే కనిపిస్తుంది.