ది రాజసాబ్ కి తెలంగాణ గవర్నమెంట్ అలాంటి ఇలాంటి షాక్ ఇవ్వలేదు, టికెట్ రేట్లు పెంచకుండా సినిమా విడుదలయ్యేవరకు జీవో జారీచెయ్యకుండా ప్రీమియర్స్ కి ఎఫెక్ట్ అయ్యేలా చేసారు. నైట్ 9 కి మొదలు కావాల్సిన రాజాసాబ్ ప్రీమియర్స్ మిడ్ నైట్ మొదలయ్యాయి. అది కూడా అభిమానులు గందరగోళం నడుమ.
ఇక ఆతర్వాత టికెట్ రేట్లు పెంచి జీవో ఇచ్చేసరికి ఏపీ నుంచి రాజసాబ్ ప్రీమియర్స్ కి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఈ రెండు విషయాల్లో మేకర్స్ నలిగిపోతుంటే.. ఇప్పుడు రాజసాబ్ కి మరో షాక్ తగిలింది. అది టికెట్ల పెంపుపై మరోసారి తెలంగాణ హై కోర్టు మేకర్స్ కి బిగ్ షాక్ ఇచ్చింది. టికెట్ రేట్లు పెంచుకోమని ప్రభుత్వం ఇచ్చిన మెమోను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు, పాత ధరలకే టికెట్లను అమ్మాలని కోర్టు ఆదేశించింది.
అంతేకాకుండా ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా, టికెట్ రేట్లు పెంచబోమని మంత్రి కూడా చెప్పారు.. అయినా టికెట్ల రేట్ల పెంపును అనుమతిస్తూ ఎందుకు మెమోలు ఇస్తున్నారు, తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.