పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానుల్లో ఎంత క్రేజో అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నా ఆయన్ని అభిమానులు సినిమాల్లోనూ ఎంకరేజ్ చేస్తున్నారు. రాజకీయాల్లో గెలవలకుముందు సినిమాలు ఒప్పుకుని అవి పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలకు బ్రేక్ ఇస్తారనుకున్నారు. కానీ ఆయన సురేందర్ రెడ్డి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆయన ఈరోజు జరిగిన పిఠాపురం సంక్రాంతి కార్యక్రమంలో మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోకి డబ్బు సంపాదించడానికి రాలేదు. నేను ఒక యాక్టర్ ని. సినిమాల్లో నేను నెంబర్ 1 కాకపోవచ్చు కానీ నా స్థాయిలో నేను బాగా డబ్బులు సంపాదించగలిగే నటుడుని. ఓడిపోయినా కానీ, సినిమా ఫ్లాప్ అయినా డబ్బులు చేసుకునే కెపాసిటీ ఉన్న నటుడిని.
అది అభిమానుల మద్దతు వల్లే. అలాంటి నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటే అది నా ఆవేదన, పాలిటిక్స్ నా బాధ్యత. ఎంతసేపు ధాన్యం పండించి దోచేసుకోవడం తప్ప, తిరిగి ఇవ్వడానికి ఏడిస్తే ఎలా అంటూ గత ప్రభుత్వం పై పవన్ నిప్పులు చెరిగారు.
అంతేకాకుండా పవన్ ఇంకా మాట్లాడుతూ.. కొందరు పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా వైరల్ చేస్తున్నారు. పిఠాపురంలో కాకి ఈక ఊడి పడినా ఏదో జరిగిందని ప్రచారం చేస్తున్నారు.. అవాస్తవాలను వైరల్ చేయడం మానుకోవాలి. ఏదైనా చెడగొట్టడం, కూలగొట్టడం చాలా తేలిక.. నిర్మించడం కష్టం.
ఈ సంక్రాంతి నుంచి కోడి పందేలు... పేకాట పోవాలి, అలాంటి సంప్రదాయం ను బోగీ మంటల్లో కలిపేయాలి, పేకాట... కోడి పందేలు అనేది కేవలం సరదా, కోట్లు చేతులు మారతాయనే అభిప్రాయం ఉంది, మన సంసృతి మనమే నాశనo చేసుకోవద్దు, ప్రజల్లో మార్పు రావాలి అంటూ చెప్పుకొచ్చారు.