పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం ది రాజసాబ్. నేడు విడుదలైన ఈ చిత్రం గత రాత్రి నుంచే ప్రీమియర్స్ అంటూ తెగ హడావిడి చేసినా తెలంగాణాలో రాజసాబ్ కి టికెట్ రేట్స్ హైక్ విషయంలో ప్రభుత్వానికి, నిర్మాతలకు మధ్యన సయోధ్య కుదరక జీవో రావడం లేట్ అవడంతో ప్రీమియర్స్ లేట్ అయ్యాయి. అక్కడే రాజ్ సాబ్ కి బాగా ఎఫెక్ట్ అయ్యింది.
మరోపక్క రాజసాబ్ ప్రీమియర్స్ హంగామా నిర్మాతల కొంప ముంచింది. రాజసాబ్ ప్రీమియర్స్ టాక్ తేడా కొట్టింది, సోషల్ మీడియాలో రాజాసాబ్ ప్రీమియర్స్ డివైడ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. అటు తెలంగాణ ప్రీమియర్స్ విషయంలో లాస్ అయిన నిర్మాతలకు ఈ డివైడ్ టాక్ తలనెప్పిగా మరింది. ప్రీమియర్స్ వెయ్యకుండా ఉంటె ఓపెనింగ్స్ బావుండేవి.
అటు బుక్ మై షో లో బుకింగ్స్ ఓపెన్ అయిన ఐదు నిమిషాల్లో టికెట్లు హాట్ కేక్ ల్లా బుక్ అయ్యాయి. కానీ ప్రీమియర్స్ టాక్ చూసి మొదటిరోజు రాజసాబ్ చూడాలంటె చాలామంది భయపడుతున్నారు. పాపం రాజసాబ్ కి రెండు విధాలుగా నష్టమే అన్నట్టుగా ఉంది పరిస్థితి.