నేడు సంక్రాంతి స్పెషల్ గా జనవరి 9 న బాక్సాఫీసు బరిలొ ముందుగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ది రాజసాబ్ ప్రీమియర్స్ తోనే గత రాత్రి నుంచి హంగామా చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ రాజసాబ్ థియేటర్స్ దగ్గర రచ్చ రచ్చ చేసారు. ఏపీలో రాజసాబ్ ప్రీమియర్స్ ప్రశాంతంగా అభిమానుల కోలాహలం నడుమ నిర్వహించగా.. తెలంగాణాలో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు.
ప్రీమియర్స్ విషయంలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో మేకర్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యకపోవడం తో తెలంగాణాలో రాజసాబ్ ప్రీమియర్స్ పై దెబ్బపడింది. అటు అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. బుక్ మై షో లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాకపోయినా కొన్ని థియేటర్స్ దగ్గర అభిమానులు కాచుకుని కూర్చున్నారు.
హైదరాబాద్ లోని మైత్రివారి విమల్ థియేటర్ వద్ద గందరగోళం ఏర్పడింది. చివరి నిమిషంలో రాజసాబ్ ప్రీమియర్ ని మీడియాకి వేసేందుకు మేకర్స్ రెడీ అవ్వగా.. మీడియా వారికన్నా ముందే రాజసాబ్ సినిమా ప్రీమియర్ షో చూసేందుకు విమల్ థియేటర్ వద్దకు ప్రభాస్ అభిమానులు భారీగా తరలి వచ్చేసారు.
మీడియా ప్రతినిధులకు మాత్రమే ప్రీమియర్ షో వేస్తామని తెలపడంతో, ఒక్కసారిగా థియేటర్ లోపలికి దూసుకెళ్లిన అభిమానులు, అక్కడి కుర్చీలను ఆక్యుపై చేసేసారు, దీంతో మీడియా వారికి వేయాల్సిన షో కూడా రద్దు చేసి ప్రభాస్ అభిమానులను బయటకు పంపించి థియేటర్ యాజమాన్యం.. ఎప్పటికో అంటే అర్ధరాత్రి దాటాక పరిస్థితి సద్దుమణిగాక మీడియా వారికి షో వేశారు. పాపం రాజసాబ్ తెలంగాణాలో భలే ఇరుకునపడ్డాడు.