అవును ఏపీ లో రాజసాబ్ థియేటర్స్ దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ప్రభాస్ రాజాసాబ్ ప్రీమియర్స్ జరిగే థియేటర్స్ దగ్గర రెబల్ ఫ్యాన్స్ మాములుగా హంగామా చెయ్యడం లేదు. ప్రభాస్ కటౌట్స్ కి పాలాభిషేకాలు, బాణా సంచాలతో థియేటర్స్ దగ్గర నానా హంగామా చేస్తూ ప్రీమియర్స్ వీడియోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటే..
తెలంగాణాలో ప్రభాస్ రాజసాబ్ థియేటర్స్ వెలవెల బోతున్నాయి. ప్రీమియర్స్ తో దుమ్మురేపుదామని తెలంగాణ రెబల్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నకొద్దీ అది వెనక్కి పోతుంది. మరికొన్ని గంటల్లో విడుదల అన్న సమయంలో టికెట్ రేట్ల హైక్ రాని కారణంగా బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు.
దానితో ఏపీలో రాజసాబ్ ప్రీమియర్స్ సందడి మొదలైపోతే.. తెలంగాణాలో రాజాసాబ్ ప్రీమియర్స్ థియేటర్స్ వెలవెల బోతున్నాయి.