బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే తర్వాత విన్నర్ కళ్యాణ్ పడాల, రన్నర్ తనూజ లు కలిసి కనిపిస్తారని చాలామంది అభిమానులు ఎక్స్పెక్ట్ చేసారు. కళ్యాణ్ పడాల, తనూజ బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్లీ గానే ఉన్నా వైల్డ్ కార్డు ఎంట్రీలు, అలాగే మరికొంతమంది హౌస్ మేట్స్ వారిమధ్యన ఫ్రెండ్ షిప్ కాదు లవ్ ఉంది అంటూ ఆమెను బ్లేమ్ చేసే ప్రయత్నం చేసినా వారిద్దరూ క్యూట్ గా స్వీట్ గానే కనిపించారు.
వారిద్దరి వీడియోస్ ని ఆడియన్స్ అంతగా ఎంజాయ్ చేసారు. కానీ గ్రాండ్ ఫినాలే తర్వాత తనూజ, కళ్యాణ్ కలవలేదు, ఎవరికి వారు బిజీ అయినా, కళ్యాణ్ పడాల స్టార్ మా పరివార్ లో సందడి చేసినా ఎందుకో తనూజ స్టార్ మా ని అవాయిడ్ చేసినట్లుగా కనిపించింది. దానితో తనూజ అలిగింది అందుకే కళ్యాణ్ పడాల ను కలవలేదు అన్నారు.
అయితే స్టార్ మా సంక్రాంతి ఫెస్టివల్ ప్రోగ్రాం కి తనూజ వెళ్ళినట్లుగా చెప్పినా స్టార్ మా ఇప్పటివరకు తనూజ ఒక్క ప్రోమో ని వదల్లేదు, దానితో మళ్లీ అందరిలో అనుమానాలు. ఫైనల్ గా సస్పెన్స్ కి తెరదించుతూ తనూజ రాకను కన్ ఫర్మ్ చేస్తూ ప్రోమో వదిలారు. అది కూడా కళ్యాణ్ పడాల తో కలిసి తనూజ డాన్స్ చేస్తున్న ప్రోమో చూసి ఇరువురి అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోయేలాంటి ప్రోమో అది.
అదిరా తనూజ-కళ్యాణ్ కలిస్తే ఉండే మజా అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు అంటే వారి కలయికను ఎంతగా కోరుకుంటున్నారో అర్ధమవుతుంది. ఇక ఆ ప్రోమో చూసాక..
KALYAN-Thanuja😍
Chiranjeevi-Radha 🥳
Balakrishna-Vijayshanthi 😎
Venkatesh-Meena ☺️
Nagarjuna-Tabu😊
Evergreen onscreen pairs 🥰 అంటూ కామెంట్లు చేస్తున్నారు.