రవితేజ కొన్నాళ్లపాటు సినిమాల్లో నటించడమే తన బాధ్యత ప్రమోషన్స్ విషయంలో తనకెలాంటి బాధ్యత లేదు అన్నట్టుగా వ్యవహరించేవారు. ఏదో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసి చేతులు దులిపేసుకునే రవితేజ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. మాస్ జాతర సినిమా అప్పుడే రవితేజ మీడియా కి కనిపించారు, వినిపించారు.
ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ప్రమోషన్స్ రవితేజ పాల్గొనడం, ఆఖరికి బుల్లితెర షోస్, సంక్రాంతి స్పెషల్ ఈవెంట్స్ లోను తన హీరోయిన్స్ డింపుల్ హయ్యాతి, ఆషిక రంగనాధన్ తో కలిసి సందడి చెయ్యడం చూసిన రవితేజ లో ఎంత మార్పు అంటూ నెటిజెన్స్ మాట్లాడుకోవడమే కాదు మార్పు మంచిదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రతి ఈవెంట్ లో రవితేజ కనిపిస్తున్నారు. ట్రైలర్ లాంచ్, ఇంటర్వూస్, మీడియా మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ భర్త మహాశయులకు విజ్ఞప్తి ని రవితేజ చాలా ఎనేర్జిటిక్ గా ప్రమోట్ చేస్తున్నారు. మరి కొన్నాళ్లుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజ కు ఈ చిత్రమైనా విజయాన్ని అందించాలని కోరుకుందాం.