మరికొన్ని గంటల్లో రాజసాబ్ ని ప్రీమియర్స్ తో వీక్షిద్దామా అని కాచుకుని కూర్చున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి తెలంగాణ లో బిగ్ షాక్ తగిలింది. ప్రీమియర్స్ తో జనవరి 8 నైట్ నుంచే సందడి మొదలైపోతుంది అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే తెలంగాణ లో ఇంకా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు.
దానితో ఈరోజు రాత్రి నైజాం లో ప్రీమియర్స్ ఉంటాయా, లేదా అనే ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్ కనిపిస్తున్నారు. అటు రాజసాబ్ మేకర్స్ టికెట్ రేట్ హైక్ కోసం వెయిటింగ్, కానీ తెలంగాణ ప్రభుత్వం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. దానితో అభిమానుల్లో తెలియని గందరగోళం ఏర్పడింది.
ఏ క్షణమైనా రాజసాబ్ టికెట్ రేట్ల హైక్ జీవో వస్తుందా అని మేకర్స్ వెయిటింగ్, ఇటు అభిమానులు ఎప్పుడు బుక్ మై షో లో రాజసాబ్ టికెట్స్ ఓపెన్ అవుతాయా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరి రాజసాబ్ ఉత్కంఠ కి తెరపడేది ఎప్పుడో చూద్దాం.