అవును స్టార్ హీరోలపై ఉండే అభిమానం ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చిన వాళ్లపై చూపిస్తున్నారు. అది అభిమానమా, పిచ్చా అనేది చెప్పడం కష్టంగా మారింది. బిగ్ బాస్ కి వెళ్లి అభిమాన గణాన్ని సంపాదించుకున్న కళ్యాణ్ పడాల, తనూజ లను చూస్తే అభిమానులు వెర్రెత్తిపోతున్నారు. వాళ్ళు ఎక్కడ కనిపించినా గుమ్మిగూడిపోతున్నారు.
కళ్యాణ్ గత కొన్నిరోజులుగా తెగ హడావిడి చేస్తుంటే తనూజ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంది. తనూజ షాప్ ఓపెనింగ్స్, ఫ్యాన్స్ మీట్ అంటూ హడావిడి స్టార్ట్ చేసింది. బిగ్ బాస్ లో రన్నర్ గా నిలిచిన తనూజ ను చూసేందుకు అభిమానులు కోకొల్లలుగా తరలి వస్తున్నారు. షాప్ ఓపెనింగ్స్ లో ఆమెకు ఊపిరి ఆడనివ్వడం లేదు.
తాజాగా ఆమె ఫ్యాన్స్ మీట్ పెట్టగా అక్కడికి ఫ్యాన్స్ వేలాదిగా చేరుకున్నారు. అసలు తనుజను ఆ మీట్ కి వెళ్లేందుకు కూడా ప్లేస్ ఇవ్వలేదు, తనూజ అందరిని తోసుకుంటూ స్టేజ్ ఎక్కి కాసేపు ఫ్యాన్స్ తో మాట్లాడి ఫ్యాన్స్ కి థాంక్స్ హడావిడిగా వెళ్ళిపోయింది. అది చూసిన నెటిజెన్స్ వాళ్ళేమి సాధిచారనిరా అంత అభిమానం చూపిస్తున్నారు.
బిగ్ బాస్ కి వెళ్ళింది వాళ్ళ క్రేజ్ కోసం, డబ్బు కోసం. మీకేమిటిరా వాళ్లంటే అంత పిచ్చి, వాళ్ళ కోసం ఎగబడితే మీకేమొస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.