మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ది రాజసాబ్ సంబరాల్లో ఉండాల్సిన ప్రభాస్ ఫ్యాన్స్ లో అంతకంతకు టెన్షన్ ఎక్కువైపోతోంది. కారణం రాజసాబ్ కి సంబందించిన నైజాం లో ఇంకా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడమే. తెలంగాణలో టికెట్ రేట్స్ హైక్ విషయంలో రేవంత్ సర్కార్ కఠినంగా ఉంది.
కానీ రాజసాబ్, మన శంకర్ వరప్రసాద్ గారు నిర్మాతలు తెలంగాణ హైకోర్టుకి వెళ్లి టికెట్ రేట్లు పెంపుకు అనుమతి తెచ్చుకున్నారు. అయినప్పటికి తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుపై జీవో విడుదల చెయ్యలేదు. దానితో మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ తో సందడి షురూ అనుకుంటున్న సమయంలో రాజసాబ్ బుకింగ్స్ ఓపెన్ కాక అభిమానులు ఆందోళపడుతున్నారు.
మేకర్స్ కూడా ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ చేస్తే బుకింగ్స్ ఓపెన్ చేసేందుకు రెడీగా ఉన్నారు. అయితే ఈరోజు సాయంత్రం కోర్టు ముగిసేవరకు ఎవరూ కేసులు వెయ్యకుండా ఉంటె.. సాయంత్రం 5.30 తరువాతే రాజసాబ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.