అవకాశాలన్నీ హిట్ మెషిన్ అనీల్ రావిపూడి చుట్టూనే తిరుగుతున్నట్లు ఉంది. స్టార్ హీరోల నుంచి టైర్ 2, టైర్ 3 హీరోల వరకూ అందరూ అనీల్ తో పని చేయాలనుకుంటున్నారు. కానీ అనీల్ మాత్రం సీనియర్ హీరోలే టార్గెట్ గా సినిమాలు చేస్తున్నాడు. `మన శంకర వరప్రసాద్ గారు` హిట్ అయితే అనీల్ గ్రాఫ్ అంతకంతకు పెరిగిపోతుంది. ఈసినిమా గనుక 500 కోట్ల వసూళ్లను సాధిస్తే? ఇక అనీల్ రేంజ్ ఆకాశాన్నే అంటుతుంది.
పాన్ ఇండియా రిలీజ్ కాకపోయినా రీజనల్ మార్కెట్ లోనే 500 కోట్ల వసూళ్లు అన్నది సరికొత్త రికార్డు అవుతుంది. ఈ విషయంలో ట్రేడ్ సైతం కాన్పిడెంట్ గానే ఉంది. ఇవన్నీ అంచనా వేసే మెగాస్టార్ చిరంజీవి మరోసారి అనీల్ కోసం కర్చీప్ వేస్తున్నారా? అంటే అవుననే అనాలేమో. వెంకటేష్ తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని చిరంజీవి పబ్లిక్ గా ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఛాన్స్ ఎవరో తీసుకోవడం ఎందుకు? అనీల్ నువ్వే ఆ కథ సిద్దం చేయ్ అని చెప్పేసారు.
ఆయన చెప్పిన తర్వాత అనీల్ ఆలోచించడానికి ఏం లేదు. ఆ ఇద్దరి స్టార్ల ఇమేజ్ కు తగ్గ కథ సిద్దం చేయడమే ఆలస్యం. డేట్లు ఇవ్వడంలో పెద్దగా ఆలోచించే పనేం ఉండదు. స్టోరీ రెడీగా ఉందంటే? చిరంజీవి-వెఉంకటేష్ రంగంలోకి దిగిపోతారు. మరి ఈ కాంబో కోసం అనీల్ ఎంత సమయం తీసుకుంటాడు? అన్నది చూడాలి.
అనీల్ తర్వాత సినిమా కింగ్ నాగార్జున తో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అనీల్ కింగ్ తో చర్చలు జరుపు తున్నాడు. నాగ్ తో సినిమా పూర్తి చేస్తే సీనియర్ హీరోలందర్నీ అనీల్ కవర్ చేసినట్లే. అనీల్ పేరిట ఇదో రికార్డుగానూ ఉంటుంది. నేటి జనరేషన్ డైరెక్టర్లలలో ఇలా సీనియర్లతో సినిమాలు చేసిన దర్శకులెవరు లేరు. దీంతో అనీల్ పేరు తెలుగు పరిశ్రమలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది.