ఓవర్సీస్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజసాబ్ ని తొక్కేసి ఎగిరెగిరి పడిన విజయ్ చివరి చిత్రం జన నాయకన్ అఫీషియల్ గా వాయిదాపడింది. విజయ్ చివరి సినిమా కావడం ఓవర్సీస్ లో జన నాయకన్ చూసేందుకు తెగ వెయిట్ చేసారు, టికెట్ బుకింగ్ లో జన నాయకన్ రాజసాబ్ ని పక్కకి నెట్టేసింది. కానీ ఇప్పుడు జన నాయకన్ వాయిదా తో రాజసాబ్ కి ఎదురు లేకుండా పోయింది.
ఎక్కడ విజయ్ సినిమా రాజసాబ్ ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడేలా చేస్తుందో అని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడ్డారు. తెలుగులో విజయ్ జన నాయకన్ కి అంతగా క్రేజ్ లేకపోయినా ఎంతోకొంత అంటే బాలయ్య ఫ్యాన్స్ జన నాయకన్ ని ట్రోల్ చేయడానీకైనా సినిమా చూసేందుకు వెళ్లేవారు. అలా కొంత రాజసాబ్ కి ఎఫెక్ట్ అయ్యేది.
ఇప్పుడు తమిళనాడులోనూ రాజసాబ్ కి ఎదురు లేదు, అక్కడ కూడా రాజసాబ్ హావా నడవడం గ్యారెంటీ, ఇక ఓవర్సీస్ లో రాజసాబ్ సంక్రాంతి సినిమాల్లో బోణి కొట్టబోతుంది. సో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆల్ హ్యాపీస్ అన్నమాట.