జనవరి 12 న సంక్రాంతి స్పెషల్ గా రాబోతున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రం తో మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి హిట్ కళ కనిపిస్తుంది. వెంకటేష్ అతిధి పాత్ర చెయ్యడం, నయనతార ప్రమోషన్స్ కి రావడం, చిరు వింటేజ్ స్టయిల్ అన్ని సినిమాపై హైప్ క్రియేట్ చేసాయి. తాజాగా మన శంకరవరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెంకీ-అనిల్ రావిపూడి తో కలిసి చిరు వేసిన స్టెప్స్ తెగ వైరల్ అవుతున్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరు మాట్లాడుతూ..
సంక్రాంతికి అన్నీ సినిమాలు సూపర్ హిట్ అవ్వాలి.. అందరు సుభిక్షంగా ఉన్నప్పుడే అసలైన సంక్రాంతి.. ఇది గుర్తుండిపోయే పండుగ అయ్యేలా ప్రేక్షకులు అన్నీ సినిమాలను ధియేటర్స్ లోనె చూడాలి.. నేను గతంలో చేసిన దొంగమొగుడు, ఘరానా మొగుడు, చంటబ్బాయ్ తరహా నటనను ఈ సినిమాలో చూస్తారు.
వెంకటేష్ తో కలిసి నటించటం చక్కని ఎక్స్ పీరియన్స్.. లాస్ట్ రోజు ఎమోషనల్ అయ్యాను.. వెంకటేష్ పాజిటివ్ మనిషి.. నాకు గురువులా అనిపిస్తూ ఉంటాడు.. తాను నాతో కలిసి సినిమా చేయాలని కోరిక ఉంది. మేము షూటింగ్ లా కాకుండా.. అల్లరి చేశాం.. అదే క్యాప్చర్ చేశాడు అనీల్.. ఈ సినిమాను నేను నెక్ట్స్ లెవెల్ వెళ్లేలా సపోర్ట్ చేసిన వెంకీకి ధన్యవాదాలు..
నేను మరలా వెంకితో హుషారుగా మరిన్ని సినిమాలు చేస్తాం.. ఆ బాధ్యత అనీల్ దే.. నయనతార తో కూడా అనీల్ ప్రమోషన్స్ చేయించాడు .. ఈ మధ్యకాలంలో నేను చాలా హుషారుగా సినిమా చేశాను.. ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్.. బడ్జెట్ పరంగా , టైమ్ పరంగా చిత్రీకరణ చేయగలిగాము.. అంటూ చిరు మాట్లాడారు.