Advertisement
Google Ads BL

ఫ్యాన్స్ కి షాక్ - జన నాయకన్ పోస్ట్ పోన్


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జన నాయకన్ పోస్ట్ పోన్ అయ్యింది. రేపు జనవరి 9న విడుదల కావాల్సిన జన నాయకన్ సెన్సార్ కారణాలతో విడుదలను ఆపేసారు. జన నాయకన్ ప్రమోషన్స్ జరిగాయి, టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి, విజయ్ అభిమానులు అయితే జన నాయకన్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. 

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ కి షాకిస్తూ మేకర్స్ జన నాయకన్ ను పోస్ట్ పోన్ చేసారు. అందుకు అభిమానులకు సారీ చెబుతూ.. మా శ్రేయోభిలాషులకు, ప్రేక్షకులకు జన నాయకన్ విడుదల వాయిదా వేస్తున్నట్లుగా తెలియజేయడానికి మేము చాలా విచారిస్తున్నాము. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జన నాయకన్ సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. 

మా నియంత్రణలో లేని కొన్ని అనివార్య కారణాల వల్ల జన నాయకన్ ను విడుదల వాయిదా పడింది. ఈ సినిమాపై మీకున్న అంచనాలు, ఉత్సాహం, భావోద్వేగాలను మేము పూర్తిగా అర్థం చేసుకోగలము. సినిమా పోస్ట్ పోన్ నిర్ణయం మాకు కూడా చాలా కష్టమైన విషయమే. జన నాయకన్ న్యూ రిలీజ్ డేట్ ని వీలైనంత త్వరలో ప్రకటిస్తాము. అప్పటివరకు, ప్రేక్షకులు, అభిమానులు ఓపికతో ఉండి మాపై మీ ప్రేమాభిమానాలను ఇలాగే కొనసాగించాలని వినయపూర్వకంగా కోరుకుంటున్నాము. మీ మద్దతే మా జన నాయకన్ టీమ్‌కు అతిపెద్ద బలం. అది మాకు ఎంతో విలువైనది అంటూ జన నాయకన్ మేకర్స్ ఓ ప్రెస్ నోట్ షేర్ చేసారు. 

Jana Nayagan Release Postponed:

Vijay Jana Nayagan Release Postponed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs