ఎన్నో ఆశలతో ఈ శుక్రవారం విడుదలయ్యే జన నాయగన్ సక్సెస్ కోసం హీరోయిన్ పూజ హెగ్డే ఎదురు చూస్తుంది. రెండేళ్ల గ్యాప్ తో కోలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే కి సెకండ్ ఇన్నింగ్స్ లోను విజయం దరి చేరడం లేదు. కూలి లో మౌనిక సాంగ్ తో ఊపేసిన పూజ హెగ్డే విజయ్ చివరి జన నాయగన్ లో హీరోయిన్ గా నటించింది.
మరి భగవంత్ కేసరి కి రీమేక్ గా తెరకెక్కిన జన నాయగన్ లో పూజ హెగ్డే పాత్రపై ఈపాటికే అందరికి క్లారిటీ వచ్చేసింది. భగవంత్ కేసరిలో కాజల్ నటించింది. అదే పాత్రను అక్కడ పూజ హెగ్డే చేసింది. కాజల్ పాత్ర ఎలా ఉందొ, పూజ పాత్ర సేమ్ ఉంటుంది. సో పూజ హెగ్డే జన నాయగన్ లో ఎలాంటి పెరఫార్మెన్స్ ఇస్తుందో అనే ఆత్రుత అంతగా ఎవరిలో కనిపించడం లేదు.
అంతేకాదు మలేషియా లో జరిగిన జన నాయగన్ ఆడియో ఈవెంట్ తర్వాత పూజ హెగ్డే మళ్లి ప్రమోషన్స్ లో కనిపించలేదు, విజయ్ రాకపోతేనేమి, పూజ హెగ్డే మమిత బైజులు సినిమాని ప్రమోట్ చేస్తే మీడియాలో హైలెట్ అయ్యేవారు కదా అనేది కొంతమంది వాదన. మరి పూజ హెగ్డే కి జన నాయగన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో ఆమె కన్నా ఎక్కువగా ఆడియన్స్ వేచి చూస్తున్నారు.