చాలామంది స్టార్ హీరోలు సినిమా ఫినిష్ అవ్వగానే.. పోస్ట్ ప్రొడక్షన్ దర్శకులకు వదిలేసి ఎంచక్కా వెకేషన్ కి వెళ్ళొచ్చేస్తారు. సినిమా విడుదల తేదీ దగ్గరకు రాగానే మొక్కుబడిగా ప్రమోషన్స్ చేస్తారు, నిర్మాతలు కోసం నిలబడే హీరోలు చాలా తక్కువ. సినిమాలను ఎంత ఎక్కువ ప్రమోట్ చేస్తే అంత ఎక్కువ క్రేజ్ వస్తుంది, నిర్మాతలకు లాభాలొస్తాయని పెద్దగా హీరోలు ఆలోచించడం లేదు.
రాజమౌళి లాంటి వాళ్ళు నిర్మాతల కోసం పని చేస్తారు. హీరోలను ఎక్కడికి పోనివ్వకుండా సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళతారు. కానీ కొంతమంది దర్శకులు చెప్పినా హీరోలు వినరో, లేదంటే పెద్ద హీరోలతో మనకెందుకులే అనుకుంటారో తెలియదు కానీ, వారిని కావాల్సినట్టుగా వినియోగించుకోరు.
సినిమా హిట్ అయితే హీరోలు పారితోషికాలు పెరిగిపోతాయి. ప్లాప్ అయితే నిర్మాతలు నష్టాల్లోకి జారిపోతారు. అటు బయ్యర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఒత్తిళ్లతో నిర్మాతలు నలిగిపోతారు. ఎక్కడో ఒక హీరో ముందుకొచ్చి పారితోషికాలు త్యాగం చేస్తుంటారు కానీ కొంతమంది నిర్మాతలేమైపోయినా పట్టించుకోరు.
విడుదలకు ముందే వెకేషన్స్ అంటూ వెళ్ళిపోతారు ఆ సినిమా రిజల్ట్ తో హీరోలు తమకు పనిలేనట్టుగా వ్యవహరిస్తారు. మరి ఇది న్యాయమేనా అనేది నెటిజెన్స్ ప్రశ్న.