అవసరం మేర డైరెక్టర్ ఎంత మంది హీరోయిన్లు? అయినా తీసుకుంటాడు. అలా ఎంపిక చేయడం అన్నది స్టోరీ, క్యారెక్టర్ల మీద ఆధారపడుతుంది. కొన్ని సినిమాలు తక్కువ క్యాస్టింగ్ తో పూర్తవుతుంటాయి. మరి కొన్నింటిని భారీ తారాగణంతో నింపేస్తుంటారు. అలాంటి ఓ స్టార్ హీరో సినిమా పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. ఇందులో హీరోకి జోడీగా ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.
తొలుత ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లనే దర్శకుడు అనుకున్నాడు? కానీ ఆ విషయం హీరో కి తెలియక ఇద్దరు హీరో యిన్లు పెట్టమని అడిగాడు. అందుకు ఆ దర్శకుడు ఇద్దరు కాదు, ముగ్గురు హీరోయిన్లు పెడతానని హీరో ఆనందాన్ని రెట్టింపు చేసాడు. మరి ఇందులో ఏ హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది? అంటే ఇద్దరు హీరోయిన్ల పేర్లనే చెప్పాడు. మిగతా హీరోయిన్ ని కూరలో కరివేపాకులా తీసేసాడు. ఆమెతో హీరో కాంబినేషన్ సన్నివేశాలు పెద్దగా ఉండవన్నాడు.
కానీ ఆ నటి మంచి ప్రతిభావంతురాలని, ప్యూచర్ లో మంచి హీరోయిన్ అయ్యే అవకాశం కూడా ఉందని అంచనా వేసాడు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే తన సినిమాలో ప్రత్యేకంగా ఆమెని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఓ రకంగా ఆమెకి ఆ డైరెక్టర్ లిప్ట్ ఇస్తున్నట్లే. తెలుగులో రెండు..మూడు సినిమాలే చేసింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. అలాంటి నటికి ఓ అవకాశం కల్పించడం అన్నది గొప్ప విషయం. సినిమా హిట్ అయితే ఆ ఛాన్స్ కొత్త అవకాశాలకు దారి తీస్తుంది.