మెగాస్టార్ చిరంజీవి లాస్ట్ మూవీ భోళా శంకర్. తమిళంలో హిట్ అయిన అజిత్ వేదాళం చిత్రాన్ని తెలుగులో భోళా శంకర్ గా రీమేక్ చేసారు. అది థియేటర్స్ లో అట్టర్ ప్లాప్ అయ్యింది. సినిమా ప్లాప్ విషయం పక్కనపెడితే.. అసలు భోళా శంకర్ రిలీజ్ రోజున థియేటర్స్ లో ప్రేక్షకులు కనిపించకపోవడమే పెద్ద అవమానంలా మెగా ఫ్యాన్స్ ఫీలయ్యారు.
తాజాగా నారి నడుమ మురారి మూవీ ప్రమోషన్స్ లో నిర్మాత అనిల్ సుంకర భోళా శంకర్ ప్లాప్ విషయంగా మట్లాడుతూ.. భోళా శంకర్ విషయంలో బాగా హర్టయ్యాను. సోషల్ మీడియా డెకాయిట్లు కొంతమంది.. టైమ్ చూసి దెబ్బ కొట్టారు. ముందే మీమ్స్ తయారు చేసుకొన్నారు. వాళ్లు ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నారు.. అంటూ భోళా శంకర్ ప్లాప్ అనేది సోషల్ మీడియా మీమ్స్ వల్లే జరిగినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.
మరి భోళా శంకర్లో మెగాస్టార్ లుక్స్ విషయంలోనూ, మేకింగ్ విషయంలోనూ ఇలా ప్రతి చిన్న విషయంలో ఆడియన్స్ నుంచి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. మెగాస్టార్ సినిమా అయినా రెండోరోజుకే సినిమా థియేటర్స్ లో మెగా ఫ్యాన్స్ కూడా కనిపించలేదు.