సూపర్ స్టార్ మహేష్-రాజమౌళి కలయికలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కతున్న వారణాసి గ్లింప్స్ రీసెంట్ గా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. రుద్ర గా మహేష్ లుక్ చూసి అభిమానులు ఎంజాయ్ చేసారు. ఈ చిత్రంలో మహేష్ ఐదు పాత్రల్లో కనిపిస్తారని టాక్. అయితే ఈ చిత్రం 2027 సమ్మర్ విడుదల అంటూ కీరవాణి ఆ ఈవెంట్ లోనే లీక్ చేసారు.
అయితే తాజాగా రాజమౌళి వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నారట. రాజమౌళి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే మిగతా భాషల సినిమాలన్నీ సైలెంట్ అవ్వాల్సిందే. వారణాసి చిత్రాన్ని 2027 ఏప్రిల్ 9 (శుక్రవారం) విడుదల చెయ్యాలని భావిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. ఏప్రిల్ 7 ఉగాది, ఏప్రిల్ 15 శ్రీరామనవమి ఇలా ఫెస్టివల్స్ కలిసొచ్చేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట.
ఇక ఈచిత్రంలో మందాకినీ గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. కుంభ గా విలన్ రోల్ లో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. రీసెంట్ గానే మహేష్ కి ఫాదర్ కేరెక్టర్ లో ప్రకాష్ రాజ్ వారణాసి సెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు.