ఇంకా రెండు రోజుల్లో థియేటర్స్ లో విడుదలకావాల్సిన కోలీవుడ్ విజయ్ జన నాయగన్ చిత్రానికి ఇంకా కష్టాలు తీరలేదు, ఎన్నో అంచనాలు, ఎంతో హైప్, విజయ్ చివరి చిత్రం కావడంతో ఆయన అభిమానులు జన నాయగన్ ని సక్సెస్ చెయ్యాలనే తపనతో ఉంటే.. ఇటువైపు సెన్సార్ సభ్యులు నుంచి ఇంకా చిక్కులు తప్పట్లేదు.
రెండు రోజుల్లో విడుదలకావల్సిన జన నాయగన్ చిత్రానికి ఇంకా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చెయ్యలేదు. ఈ సినిమా సెన్సార్ ఇంకా పూర్తి కాకపోవడంతో అభిమానుల్లో బుకింగ్స్ పరంగా కూడా సందిగ్ధత నెలకొంది. మరి మేకర్స్ కూడా సెన్సార్ విషయంలో అన్ని ఏర్పాట్లు చేసినా ఇప్పటికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోవడంపై మద్రాస్ హైకోర్టు కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది.
సినిమా విడుదలకు, ప్రీమియర్స్ కి సయం ఆసన్నమవుతున్నవేళ ఇలా సెన్సార్ బోర్డు మేకర్స్ ని ఇబ్బంది పెట్టడం పై అభిమానుల్లో ఆగ్రహం కనిపిస్తుంది. అయితే జన నాయగన్ కి సంబందించి తాము చెప్పిన కట్స్ చెయ్యకపోవడంతోనే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చెయ్యకుండా సస్పెన్స్ లో పెట్టింది అంటున్నారు.