మలయాళం సినిమాలు అక్కడ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అవుతుంటే.. సౌత్ లోని మిగతా భాషల్లో ఓటీటీ లో హిట్ అవుతున్నాయి మలయాళ చిత్రాలు స్లో గా ఉన్నా, అందులో నటులెవరూ తెలియకపోయినా సౌత్ ఆడియన్స్ మలయాళ సినిమాలకు కంటెంట్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆదరించేస్తున్నారు.
గత ఏడాది నవంబర్ లో మలయాళంలో విడుదలైన ఎకో అనే చిన్న సినిమాని అక్కడి ప్రేక్షకులు పెద్ద హిట్ చేసారు. ఎంత పెద్ద హిట్ అంటే.. ఐదు కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 50 కోట్ల కలెక్షన్స్ ఇచ్చినంత హిట్ చేసారు. ఇప్పడు ఈ చిత్రం తెలుగు, తమిళ ఇతర భాషల్లో నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఎకో చిత్రాన్ని తెగ వీక్షిస్తున్నారు మూవీ లవర్స్.
ఎకో మూవీ లో స్టార్ నటులు ఎవరు లేరు. కుక్కలా చుట్టూ కథను అల్లాడు దర్శకుడు. కేరళ-కర్ణాటక సరిహద్దులోని ఓ ఎత్తైన కొండ. దానిపై మిలాతియా అనే మలేషియా మహిళను చూసుకోవడానికి షీమోన్ అనే కుర్రాడు వస్తాడు. మిలాతియా ఇంటి చుట్టూ కుక్కలు కాపలాగా ఉంటాయి. ఆమె ఆస్తి కోసం వారసులు, ఆమె భర్త కోసం పోలీసులు ఆమె ఇంటి చుట్టూ తిరుగుతారు. అటు మిలాతియా పక్కనే ఉండి సేవ చేసే పీయూష్ కూడా మిలాతియా కోసం కాకుండా తన గురువు కోసమే పని చేస్తాడు. కురియచన్-మోహన్ స్నేహితులు. మోహన్ ని మోసం చేసి జైల్లో పెట్టించి కురియచన్ మిలాతియాతో ఉంటాడు. ఒకొనొక సమయంలో కురియచన్ కనిపించకుండా పోతాడు. అదే ఎకో స్టోరీ.
చాలా స్లోగా సాగినా మధ్యలోని కొన్ని ట్విస్ట్ లో ఎకో ని చూసేవారి చూపు తిప్పుకోకుండా చేసింది. మొదట్లో ఏం సినిమా చూసున్నాం అనుకున్న వాళ్ళే అసలు పాయింట్ ని అర్ధం చేసుకుంటే ఏముందిరా సినిమా అనేటువంటి కథ ఎకో. ఎకో కథ మొతం కుక్కలా చుట్టూనే తిరుగుతుంది. కేవలం నటుడు వినీత్ తప్ప మిగతా కేరెక్టర్స్ ఏవి మనకు పరిచయం లేనివే, అయినా బోర్ కొట్టని సినిమా ఎకో. అందుకే ఓటీటీ లో తెగ ట్రెండ్ అవుతుంది.