హీరో విజయ్ నటించిన జన నాయగన్ రేపు శుక్రవారం జనవరి 9 విడుదల కాబోతుంది. విజయ్ ఈ చిత్రం తర్వాత సినిమాల నుంచి తప్పుకోబోతున్నట్టుగా మలేషియల్ లో జరిగిన జన నాయగన్ ఆడియో ఈవెంట్ లో అభిమానుల సమక్షంలో అనౌన్స్ చేసారు. అందుకే జన నాయగన్ చిత్రంపై కోలీవుడ్ నుంచి ఓవర్సీస్ వరకు భారీ అంచనాలున్నాయి.
ఇలాంటి సమయంలో విజయ్ కి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నోటీసులు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. విజయ్ సినిమాల నుంచి తప్పుకుని ఇకపై పూర్తిస్థాయి రాజకీయాల్లో బిజీ కాబోతున్నారు. దానిలో భాగంగా విజయ్ ప్రజల్లోకి నేరుగా వెళుతున్నారు. కొద్దినెలల క్రితం కరూర్ లో భారీ సభను నిర్వహించగా అక్కడికి విజయ్ అభిమానులు వేలాదిగా చేరుకోగా అక్కడ తొక్కసలాట జరిగి 41 మంది మృతి చెందగా, 60 మంది గాయపడిన విషయం తెలిసిందే.
కేవలం 10 వేల మంది పట్టె సభ దగ్గరకు దాదాపు 30,000 మంది రావడంతో తొక్కిసలాట జరిగి 41మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దానితో విజయ్ పై కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈతొక్కిసలాట ఘటనలో విజయ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.