కొన్నాళ్లుగా నటి మీనాక్షి చౌదరి అక్కినేని హీరో సుశాంత్ ని వివాహమాడబోతుంది.. మీనాక్షి చౌదరి-సుశాంత్ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు మాములుగా చక్కర్లు కొట్టడం లేదు. మీనాక్షి చౌదరి - సుశాంత్ లు కలిసి ఇచ్చట వాహనములు నిలపరాదు అనే మూవీలో నటించారు. ఆతర్వాత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు.
అటు సుశాంత్ కెరీర్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోతే మీనాక్షి చౌదరి మాత్రం టాప్ రేంజ్ కి వెళ్ళిపోయింది. అయితే సుశాంత్, మీనాక్షి చౌదరి దుబాయ్ వెళ్ళినప్పుడు కలిసి కనిపించడం, ఇలా కొన్నిసార్లు జరగడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్తలు వినిపించాయి.
ఈ విషయమై మీనాక్షి చౌదరి టీమ్ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా తాజాగా అనగనగ ఒక రాజు ప్రమోషన్స్ లోను మీనాక్షి చౌదరికి అదే ప్రశ్న ఎదురు కాగా.. ఆమె ఈ పెళ్లి వార్తలను కొట్టిపారేసింది. సుశాంత్, తాను చాలా మంచి ఫ్రెండ్స్ అని.. అంతేకాని అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని మీనాక్షి చౌదరి మరోసారిస్పష్టం చేసింది.
సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ చాలా సహజమని, వాటికి తాము అలవాటు పడిపోతుంటామని, మా పెళ్లివార్తలు చూసి తామిద్దరం నవ్వుకున్నట్లు మీనాక్షి ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.