అక్కినేని అఖిల్-సురేందర్ రెడ్డి కలయికలో అనిల్ సుంకర తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ఏజెంట్. ఏజెంట్ దెబ్బకు అఖిల్ గత రెండేళ్లుగా ఎవ్వరికి కనిపించలేదు, దర్శకుడు సురేందర్ రెడ్డికి మూడేళ్లకు పవన్ ప్రాజెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అనిల్ సుంకర అయితే ఆర్ధికంగా నష్టపోయాడు. తాజాగా అనిల్ సుంకర నారి నారి నడుమ మురారి మూవీ ప్రమోషన్స్ లో ఏజెంట్ నష్టాలపై మరోసారి రియాక్ట్ అయ్యారు.
ఏజెంట్ వల్ల నేను ఆర్ధికంగా నష్టపోయాను, కానీ అఖిల్ కి కెరీర్ పరంగా మూడేళ్లు బ్రేక్ వచ్చింది, సురేందర్ రెడ్డికి అంతే. నేను డబ్బుల పరంగా నష్టాలు ఎదుర్కొన్నాను. ఈ దెబ్బ బయ్యర్ల మీద కూడా పడింది. కానీ అఖిల్ కి హిట్ ఇవ్వలేకపోయాను అనే బాధ ఉంది. అందుకే అఖిల్ తో మరో సినిమా చేద్దామని.. అతని వద్దకు అనేక కథలు పంపిస్తున్నాను.
కానీ అఖిల్ భారీ బడ్జెట్ లు వద్దు, ఏదైనా తక్కువ బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేయమని సలహా ఇస్తున్నాడు. ఎక్కువ బడ్జెట్ పెట్టి మరోసారి సాహసం చేయవద్దని సూచిస్తున్నాడు.. అంటూ అనిల్ సుంకర చెప్పడం, నిర్మాత నాగవంశీ రీసెంట్ గా లెనిన్ ప్రమోషన్స్ మొదలు పెడదాం అంటే మనం మాట్లాడొద్దు, కంటెంట్ మాట్లాడాలని అఖిల్ చెప్పినట్లుగా చెప్పాడు.
మరి ఇదంతా చూస్తే అఖిల్ ఏజెంట్ దెబ్బకి చాలా మారినట్లుగానే కనిపిస్తుంది. అందుకే లెనిన్ తో సైలెంట్ గా షూటింగ్ చేసేసి ఆడియన్స్ ముందుకు వచ్చే ప్లాన్ చేస్తున్నాడు.