ది రాజసాబ్ ముగ్గురు హీరోయిన్స్ జాతకం మారుస్తుందా.. అసలే అందాలు ఆరబొయ్యడంలో తమకు ఎవరు సాటిలేరు అంటూ రెచ్చిపోయిన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లు ముగ్గురు సినిమాలో ప్రభాస్ పక్కన రొమాన్స్ చేసేందుకు ఎంత పోటీపడ్డారో తెలియదు కానీ.. ప్రమోషన్స్ లో గ్లామర్ చూపించేందుకు మాత్రం తెగ పోటీపడుతున్నారు.
నాచే.. నాచే సాంగ్ లో అయితే ప్రభాస్ పక్కన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ లు అందాలు చూపిస్తూ రెచ్చిపోయారు. ఎంతగా అంటే ఈ సినిమాతో బ్రేక్ రావాలని.. అందాల ఆరబోతలో నెక్స్ట్ లెవల్ చూపించారు. ఒకరిని మించి మరొకరు అందాలు చూపిస్తూ ప్రభాస్ పక్కన డాన్స్ చేసారు.
ప్రమోషన్స్ లోను ముగ్గురు ఎక్కడా తగ్గడం లేదు. చీరకట్టినా, మోడ్రెన్ డ్రెస్ వేసినా ఎందులోనైనా అందాలు చూపించేందుకు వారు పడుతున్న తపన చూస్తే రాజసాబ్ ఎలాగైనా ఈ ముగ్గురికి బ్రేక్ ఇవ్వాల్సిందే అంటున్నారు వారి అభిమానులు. నిధి అగర్వాల్ కి ఈ చిత్రం సక్సెస్ అవడం చాలా కీలకం.
అటు మాళవిక కు తోలి డెబ్యూ రాజసాబ్. ఇది హిట్ అయితే మరిన్ని అవకాశాలు వస్తాయి. మరో హీరోయిన్ రిద్ది కుమార్ ది అదే పరిస్థితి. అందుకే ముగ్గురు భామలు గ్లామర్ డోస్ ని పెంచేసి రాజసాబ్ లో రెచ్చిపోయారు.