మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం సంక్రాంతి స్పెషల్ గా జనవరి 12 సోమవారం విడుదల కాబోతుంది. మెగాస్టార్ చిరు-అనిల్ రావిపూడి కలయికలో నయనతార హీరోయిన్ గా వెంకటేష్ క్యామియో చేసిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్స్, డిఫరెంట్ ప్రమోషన్స్ అన్ని అంచనాలు పెంచుతున్నాయి.
అయితే మన శంకర వరప్రసాద్ గారు లో మెయిన్ హైలెట్ గా చిరు-వెంకీ కాంబో సీన్స్ నిలవబోతున్నాయని, వెంకటేష్ దాదాపుగా 30 నిముషాలు కనిపిస్తారని, అలాగే నయనతార తో చిరు కామెడీ బాగా వర్కౌట్ అయినట్లుగా చిత్ర బృందం చెప్పడమే కాదు మన శంకర్ వర ప్రసాద్ గారు ట్రైలర్ లో హింట్ ఇచ్చేసారు.
చిరు-వెంకీ కాంబో సీన్స్ కి ఆడియన్స్ విజిల్స్ వెయ్యాల్సిందే అని, వారి మధ్యన పేలే డైలాగ్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని అంటున్నారు. మరి గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి విజయాన్ని అందుకోవాలని కష్టపడుతున్నారు.