క్యూట్ బ్యూటీ శ్రీలీల ఫస్ట్ తమిళ డెబ్యూ పరాశక్తి. శివకార్తికేయన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన పరాశక్తి చిత్రం జనవరి 14 న విడుదల కాబోతుంది. నిన్నటివరకు సెన్సార్ చిక్కులతో ఇబ్బందిపడిన పరాశక్తి పొంగల్ బరి నుంచి తప్పుకుంది అన్నారు. కానీ ఈ పొంగల్ కి జనవరి 14 న పరాశక్తి విడుదలకు సిద్దమవుతుంది.
శివకార్తికేయన్, శ్రీలీల ఇద్దరూ పరాశక్తి ని తెగ ప్రమోట్ చేసున్నారు. కారణం అదే పొంగల్ బరిలో హీరో విజయ్ చివరిగా నటించిన జన నాయగన్ ఉండడమే. మరి విజయ్ తో పోటీపడాలంటే ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చెయ్యాలి. అందుకే శ్రీలీల, శివకార్తికేయన్ సినిమాని భుజాల మీద మోస్తూ ప్రమోట్ చేస్తున్నారు. పరాశక్తి ప్రమోషన్స్ లో శ్రీలీల అద్దరగొట్టేస్తుంది.
తాజాగా శారీ లో టూ ట్రెడిషనల్ గా అందంగా కనిపించింది. కంచిపట్టు చీరలో ట్రెడిషనల్ గా జడ వేసుకుని రోజ్ పువ్వు పెట్టుకుని శ్రీలీల ఆకర్షణగా అందంగా కనిపించింది. అమాయకపు చూపులతో అమ్మడు అందం గురించే మాట్లాడుకునేలా చేసింది.