యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన `దేవర` సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. తంగ పాత్రలో కొన్ని సన్నివేశాలకే పరిమితం అవ్వడంతో? జాన్వీ పేరు పెద్దగా హైలైట్ అవ్వలేదు. తొలి భాగంలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత కనిపించలేదు. దీంతో జాన్వీ ఆశలన్నీ `పెద్ది`పైనే ఉన్నాయి. ఇందులో అమ్మడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా నటిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఇస్తాడు.
కేవలం గ్లామర్ కే పరిమితం చేయకుండా నాయిక పాత్రను హైలైట్ చేయడం అతడి ప్రత్యేకత. అలా చూసుకుంటే? జాన్వీ కపూర్ ఎంత గొప్ప పెర్పార్మర్ అన్నది `పెద్ది`తో ప్రూవ్ అవుతుంది. ఆ సంగతి పక్కన బెడితే జాన్వీ కపూర్ తరహాలోనే కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ టాలీవుడ్ లైనప్ కు అవకాశం ఉందా? అన్న సందేహం వ్యక్తమవుతుంది. ఈ బ్యూటీ కూడా ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న సినిమాతోనే తెలుగులో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. ఇదే వరుసలో చరణ్ తదుపరి సినిమాలోనూ రుక్మిణీ ఛాన్స్ అందుకుంటుందా? అన్న చర్చ నెట్టింట మొదలైంది. రామ్ చరణ్ 17వ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ఎంపికకు అవకాశాలు న్నాయంటున్నారు.
`కాంతార చాప్టర్ వన్` తో రుక్మిణీ పాన్ ఇండియాలో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. మంచి పెర్పార్మర్ గానూ గుర్తింపు దక్కించుకుంది. అందం, అభినయం అదనంగా కలిసొచ్చే అంశాలు. ఈ నేపథ్యంలో సుకుమార్ రుక్మిణీ విషయంలో పాజిటివ్ గా ఉండే అవకాశం లేకపోలేదనే డిస్కషన్ ఫిలిం సర్కిల్స్ లో జరుగుతోంది.