అక్కినేని అఖిల్ లేటెస్ట్ చిత్రం లెనిన్. మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో అఖిల్ చేస్తున్న ఈచిత్రం సైలెంట్ గా 70 శాతం షూటింగ్ ఫినిష్ చేసుకుంది. అయితే లెనిన్ మొదలైనప్పుడు ఈ చిత్రంలో హీరోయిన్ గా మేకర్స్ శ్రీలీల ను ఎంపిక చెయ్యడమే కాదు శ్రీలీల ఫస్ట్ లుక్ కూడా వదిలారు. పక్కా పల్లెటూరి అమ్మాయిగా శ్రీలీల లంగా ఓణీ లో కనిపించింది.
అయితే మధ్యలో ఏమైందో ఏమో శ్రీలీల ప్లేస్ లోకి భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. ఆ విషయాన్నీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యకుండా డైరెక్ట్ గా జనవరి 5 న అంటే ఈ రోజు భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ వదిలారు. ఆమె సేమ్ శ్రీలీల మాదిరే కనిపించింది. ఆ తర్వాత లెనిన్ నుంచి ఫస్ట్ సింగిల్ వదిలారు. అందులో భాగ్యశ్రీ బోర్సే - అఖిల్ డాన్స్ చూసాక భాగ్యశ్రీ ప్లేస్ లో శ్రీలీల ని ఊహించుకుంటున్నారు.
దానితో లెనిన్ ఫస్ట్ సింగిల్ రాగానే శ్రీలీల ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. భాగ్యశ్రీ కన్నా శ్రీలీల అయితేనే అఖిల్ సరసన బావుండేది అంటూ అక్కినేని అభిమానులు కామెంట్ల మోతతో ట్విట్టర్ X లో శ్రీలీల ట్రెండ్ అవుతుంది.