బిగ్ బాస్ సీజన్ 9 సక్సెస్ ఫుల్ గా రన్ అవడానికి ప్రధాన కారణం కన్నడ నటి తనూజ. ఆమె అందం, ఆమె మాట తీరు, ఇతర కంటెస్టెంట్స్ తో కామెడీ, కళ్యాణ్ పడాల తో స్నేహం, భరణి తో కూతురి బాండింగ్, దివ్య తో భరణి గురించి ఫైటింగ్, టాస్క్ ల్లో పోరాటం ఇలా తనూజ బిగ్ బాస్ కి బాగా కంటెంట్ ఇచ్చింది. బిగ్ బాస్ ముద్దుబిడ్డ, నాగార్జున మెచ్చిన కంటెస్టెంట్ అయిన తనూజ ఈ సీజన్ విన్నర్ అవుతుంది అని ఆమె అభిమానులు చాలా ఎక్స్పెక్ట్ చేసారు.
తనూజ నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతిసారి ఆమెను అభిమానులు టాప్ లో ఉంచారు, కానీ ఆరు వారాల తర్వాత కామన్ మ్యాన్ తనకి కాంపిటీటర్ గా చేసుకుని అతను కప్ పట్టుకెళ్ళేలా తనూజనే చేసుకుంది. అయితే తనూజ విన్నర్ కాకుండా రన్నర్ అయినా ఆమె అభిమానులు ఆమెపై ఎంతగా ప్రేమ చూసిపిస్తున్నారో హైదరాబాద్ KPHP లో ఆవకాయ షాప్ ఓపినింగ్ దగ్గర చూస్తే తెలుస్తుంది.
KPHP లో తనూజ వెళ్లిన షాప్ ఓపినింగ్ కార్యక్రమానికి ఆమె అభిమానులు వేలాదిగా తరలి రావడమే కాదు తనూజ, తనూజ అంటూ నినాదాలు చేసారు. ఆమెతో ఫొటోస్ దిగేందుకు ఎగబడ్డారు. తనూజ ను తోసేస్తూ ఆమె పక్కన నిలబడేందుకు అభిమానులు చూపించిన ఆరాటం చూసిన వారు ఇది రా తనూజ క్రేజు, ఆమె అభిమానుల మనసులు గెలిచింది. ఆమెకు బిగ్ బాస్ కప్ రాకపోతేనేమి మా ప్రేమ చాలు అంటూ ఆమె అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.