సీనియర్ హీరోయిన్స్ లో ఎవ్వరికి లేని, రాని క్రేజ్ మిల్కి బ్యూటీ తమన్నాకు ఉంది. సమంత సైలెంట్ కాగా, కాజల్ అప్పుడప్పుడు హవిడివిడి చేసినా తమన్నా మాత్రం ఎప్పుడు లైమ్ లైట్ లోనే ఉంటుంది. సౌత్, నార్త్, స్టేజ్ పెరఫార్మెన్సెస్, స్పెషల్ సాంగ్స్ అబ్బో అమ్మడుది మాములు హడావిడి కాదు.
స్పెషల్ సాంగ్స్ లో తమన్నా లా హిట్ అయిన హీరోయిన్ మరొకరు లేరు, స్వింగ్ జరా దగ్గరనుంచి నువ్వు కావాలయ్యా సాంగ్ వరకు, అటు బాలీవుడ్ లోను తమన్నా స్పెషల్ జోరు మాములుగా లేదు. ఐటెం సాంగ్ కోసం తమన్నా మూడు కోట్లు చొప్పున అందుకుంటే ఇప్పుడు మాత్రం తమన్నా నిమిషానికి కోటి లెక్కన ఆరు నిమిషాల పాట కోసం ఆరు కోట్ల రూపాయలు అందుకుంది అనే వార్త వైరల్ అవుతోంది.
రీసెంట్ గా గోవా లో జరిగిన ఓ ఈవెంట్ లో 6 నిమిషాల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌కి తమన్నా ఏకంగా రూ.6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుందట. మరి నిమిషానికి కోటి లెక్కన తమన్నా అందుకుంది అనేది ఈ రెమ్యునరేషన్ చూస్తే తెలుస్తుంది. సో మిల్కి బ్యూటీ ని టచ్ చెయ్యాలంటే నిమిషానికి కోటి సమర్పించుకోవాల్సిందే.