Advertisement
Google Ads BL

అల్లు అర్జున్-స్నేహ లకు చేదు అనుభవం


సెలబ్రిటీస్ కనిపిస్తే చాలు వాళ్లతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ వారి అభిమనం వల్లే వాళ్ళు అంతటి స్టార్ స్టేటస్ ని మైంటైన్ చేస్తున్నారు. కానీ ఈమధ్య కాలంలో అభిమానుల ఓవరేక్షన్ మాములుగా ఉండడం లేదు. రీసెంట్ టైమ్స్ లో నిధి అగర్వాల్ రాజాసాబ్ ఈవెంట్ తర్వాత జరిగిన ఘటన కలకలం సృష్టించింది. ఆమెను కారు కూడా ఎక్కనివ్వకుండా ఇబ్బంది పెట్టారు అభిమానులు. 

Advertisement
CJ Advs

ఆతర్వాత ఓ శారీ షాప్ ఓపెనింగ్ లో సమంత కు ఇలాంటి ఘటనే ఎదురైంది. తాజాగా అభిమానుల వలన అల్లు అర్జున్-స్నేహ లు ఎంతగా ఇబ్బంది పడ్డారో అనేది ఓ వీడియో చూస్తే తెలుస్తుంది. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి హైదరాబాద్ లోని అల్లు సినిమాస్ థియేటర్ ఓపెనింగ్ ఈవెంట్ పూర్తి చేసిన తర్వాత, టీ కోసం ప్రముఖ కేఫ్‌ నిలోఫర్ కు వచ్చారు. 

మరి అది పబ్లిక్ ప్లేస్. దానితో అల్లు అర్జున్-స్నేహ దంపతులను చూసిన అభిమానులు ఒక్కసారిగా సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దానితో అక్కడ పరిస్థితి అదుపు తప్పింది. కేఫ్ నుంచి బయటకు వచ్చే సమయంలో అభిమానుల గుంపు అల్లు అర్జున్ దంపతులను పూర్తిగా చెట్టెయ్యడంతో అల్లు అర్జున్ -స్నేహ లు చాలా ఇబ్బందిపడ్డారు. వారిని తోసుకుంటూ పక్కకు జరగండి అంటూ అల్లు అర్జున్ తన భార్య చెయ్యి గట్టిగ పట్టుకుని కారు ఎక్కిన దృశ్యాలు వైరల్ గా మారాయి. 

ఈ అభిమానుల పిచ్చి అభిమానానికి అదుపు లేకుండా పోతుంది. కాబట్టే తరచూ సెలబ్రిటీస్ కి ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి. 

Allu Arjun mobbed by fans :

Allu Arjun mobbed by fans at Hyderabad Niloufer cafe
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs