2026 ఏడాది మొదటిలో విడుదలవుతున్న క్రేజీ భారీ బడ్జెట్ మూవీ ది రాజాసాబ్. జనవరి 9 సంక్రాంతి బరిలో ముందుగా బాక్సాఫీసు దగ్గరకు వస్తున్న రాజసాబ్ పై మంచి అంచనాలున్నాయి. రాజసాబ్ ప్రీ రిలీజ్ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ సందడి అన్ని సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
మరోపక్క మారుతి తెగ ఇంటర్వూస్ ఇస్తున్నాడు, ప్రభాస్ అలా, ప్రభాస్ ఇలా అంటూ రాజసాబ్ పై హైప్ క్రియేట్ చేస్తున్నాడు, హీరోయిన్స్ ముగ్గురు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లు గ్లామర్ గా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు, అభిమానులు సినిమాపై ఓవర్ గా హైప్ పెట్టుకున్నారు.
అది చూసిన చాలామంది యాంటీ ఫ్యాన్స్ రాజసాబ్ పై ఉన్న ఈ ఓవర్ హైప్ రీచ్ అవుతుందా, ప్రభాస్ కి హిట్ పడుతుందా, మారుతి రాజసాబ్ నుంచి బయటపడతాడా అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి మారుతి కి రాజసాబ్ అనేది లైఫ్ అండ్ డెత్ మూమెంట్. ఈ సినిమా హిట్ అయితేనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన్ను ఏమనరు, లేదంటే మారుతి పని మాములుగా ఉండదు మరి.