మలయాళ ఇండస్ట్రీకి గత ఏడాది చాలా ప్రత్యేకం. అక్కడ మీడియం రేంజ్ సినిమాలే ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. ఇక ఇయర్ ఎండ్ లో విడుదలైన మోహన్ లాల్ వృషభ తో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని మూటగట్టుకోవడమే కాదు, మోహన్ లాల్ ని ట్రోల్ అయ్యేలా చేసింది వృషభ. గత ఏడాది మంచి మంచి హిట్స్ సాధించిన మోహన్ లాల్ కి వృషభ దిమ్మతిరిగే షాకిచ్చింది.
వృషభ తో పాటుగా మలయాళంలో అదే క్రిష్టమస్ కి విడుదలైన నివిన్ పౌలీ సర్వం మాయ చిత్రం వృషభ ని పక్కకు నెట్టి రూ.100 కోట్లు కొల్లగొట్టింది. కేవలం సర్వం మాయ చిత్రం 10 రోజుల్లో రూ.100 కోట్లు సాధించింది. ప్రేమమ్ తర్వాత మళ్లీ పదేళ్లకు నివిన్ పౌలి కి సర్వం మాయ బ్లాక్ బస్టర్ ని అందించింది.
సర్వం మాయ నివిన్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది.. అఖిల్ సత్యన్ దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ కామెడీ ఫాంటసీ ఫిల్మ్ ని మలయాళీలు ఇంప్రెస్స్ అయ్యారు. రీసెంట్ గా నివిన్ పౌలి ఫార్మా వెబ్ సిరీస్ తో సత్తా చాటి ఇప్పుడు సర్వం మాయ తో రూ.100 కోట్ల క్లబ్బులోకి చేరి రికార్డ్ క్రియేట్ చేసాడు.